News November 19, 2025

భక్తులకు అన్ని వసతులు కల్పించాలి: ఆది శ్రీనివాస్

image

వేములవాడకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. భక్తులకు కల్పించాల్సిన వసతులపై ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఇతర శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య, చెల్లించుకుంటున్న మొక్కుల వివరాలను ఆయన ఆరా తీశారు.

Similar News

News January 24, 2026

నిజామాబాద్: ఎన్నికల అధికారులకు శిక్షణ

image

నిజామాబాద్‌లోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై మాస్టర్ ట్రైనర్లు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

News January 24, 2026

కడప: జనయాత్ర పుస్తకం ఆవిష్కరణ

image

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జగన్ గతంలో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. సంబంధిత ఫొటోలతో రూపొందించిన ‘జగన్నాథుని జనయాత్ర’ పుస్తకాన్ని తాడేపల్లిలోని తన కార్యాలయంలో జగన్ శుక్రవారం ఆవిష్కరించారు. పుస్తక రచయిత రాచమల్లు రవిశంకర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. రచయితను జగన్ అభినందించారు.

News January 24, 2026

APలో ఏర్పాటు కానున్న WEF C4IR కేంద్రం

image

AP: నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) 5 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అందులో ఒకటి రాష్ట్రంలో నెలకొల్పేందుకు నిర్ణయించింది. ఇండియా(AP), ఫ్రాన్స్, UK, UAEలలో ఇవి ఏర్పాటు కానున్నాయి. WEF 2017లో ప్రారంభించిన 4వ పారిశ్రామిక విప్లవ నెట్‌వర్క్ ప్రభుత్వ, ప్రైవేటు, పరిశ్రమల సమన్వయానికి ఒక వేదికగా పనిచేస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ తరహా సెంటర్స్ హైదరాబాద్, ముంబైలో ఉన్నాయి.