News February 11, 2025
భదాద్రి: సేవాలాల్ జయంతి వేడుకకు నిధులు ఇలా..!

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్లను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. భద్రాద్రి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. భద్రాచలం రూ.20 వేలు, కొత్తగూడెం రూ.3 లక్షల 26 వేలు, అశ్వరావుపేట రూ. లక్ష 42వేలు, పినపాక రూ. 74వేలు, ఇల్లందు 6 లక్షల 76వేల రూపాయలను కేటాయించింది.
Similar News
News February 18, 2026
బందరులో ‘బెల్ట్’ దందా..! విచిత్రం ఏంటో తెలుసా?

మచిలీపట్నంలో బెల్ట్ షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగుతోందని ప్రజలు అంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి పలు బార్లు, వైన్ షాప్స్ నుంచి లిక్కర్ బాటిళ్లు పంపిణీ చేస్తున్నారంటున్నారు. రోజుకి 2 వేల బాటిళ్ల వరకు సరఫరా చేస్తున్నారని ఓ జనసేన నేత బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. కొందరు YCP నేతల కనుసన్నల్లో షాపులు యథేచ్ఛగా నడుపుతుండటం గమనార్హం. మంత్రి రవీంద్ర నియోజకవర్గం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News February 18, 2026
నెల్లూరు: రంజాన్.. 31 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.!

31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్ మాసం రావడం విశేషం. నేటి(బుధవారం) రాత్రి చంద్ర దర్శనంతో ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ నెల ప్రారంభమవుతుంది. గురువారం తెల్లవారుజాము నుంచి ముస్లింలు తమ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. ఈ నెలలో సేవలు, దానధర్మాలు చేస్తే పుణ్యకార్యంగా భావిస్తారు. మార్చి 19 లేదా 20 తేదిలలో ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఆరోజు ఈద్ ఉల్ ఫితర్‌ను చేసుకోనున్నారు.
News February 18, 2026
పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన్ను పికప్ చేసుకునేందుకు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తుండగా కాన్వాయ్‌లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో చివరి వాహనం దెబ్బతింది. ప్రమాద సమయంలో కాన్వాయ్‌లో పవన్ లేకపోవడం, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


