News May 7, 2025
భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం శనివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
Similar News
News February 14, 2026
విశాఖ చేరుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్

విశాఖలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్‌తో పాటు పలువురు కోర్ట్ అధికారులు ఉన్నారు.
News February 14, 2026
మాజీ మంత్రి జోగి కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డి

వైసీపీ నేత, మాజీ MLA చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసానికి వచ్చి జోగి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం చెవిరెడ్డి మాట్లాడుతూ..అరెస్టుల ద్వారా కక్ష సాధించాలనుకుంటే వైసీపీ నేతలు భయపడరన్నారు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇలాంటి సంస్కృతి చాలా ప్రమాదకరమన్నారు.
News February 14, 2026
మహబూబ్‌నగర్‌లో రీకౌంటింగ్..!

మహబూబ్‌నగర్ మేయర్ పీఠం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లలో పోలింగ్ జరిగింది. 58వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. 59 స్థానాల్లో కాంగ్రెస్-29, BRS-15, BJP-7, ఇతరులు 8 మంది విజయం సాధించారు. అయితే 53వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థిపై 29 ఓట్ల మెజార్టీ రాగా.. అక్కడ రీకౌంటింగ్ జరుగుతోంది.


