News May 7, 2025

భద్రకాళి ఆలయంలో కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన

image

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైన బాధితులు ఎవరిని సంప్రదించాలి, 1930 నంబర్‌కు ఎలా ఫిర్యాదు చేయాలి, మత్తు పదార్థాల వినియోగం, విక్రయం ద్వారా కలిగే నష్టాలను ఎస్ఐ పోచాలు స్థానిక భద్రకాళి దేవాలయంలోని భక్తులకు వివరించారు.

Similar News

News February 13, 2026

మేడ్చల్‌లో పట్టు నిలుపుకున్న మల్లారెడ్డి

image

మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ MLA మల్లారెడ్డి పట్టు నిలుపుకున్నారు. BJP గెలుపు కోసం MP ఈటల రాజేందర్, కాంగ్రెస్ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేటలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో పురపోరు మరింత రసవత్తరంగా మారింది. నేటి ఫలితాల్లో TGలో మెజార్టీ కాంగ్రెస్ గాలి వీచినా.. మేడ్చల్‌లో జనం కారుకే మొగ్గు చూపారు. 33 వార్డుల్లో మల్లన్న చరిష్మా స్పష్టంగా కనిపించింది.

News February 13, 2026

ఆలేరు మున్సిపల్ పీఠం ‘హస్త’గతం

image

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆలేరు మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు, బిజెపి 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఛైర్మన్ రేసులో ఏడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి భాస్కర్ ఉన్నట్లు సమాచారం.

News February 13, 2026

భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్‌దే

image

భూపాలపల్లి పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 30 వార్డులకు గాను కాంగ్రెస్ 16 స్థానాలను గెలిచింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన కాంగ్రెస్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమైంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 10 స్థానాలు, సీపీఐ ఒకటి, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలుపొందారు.