News March 14, 2025
భద్రాచలంలో వైభవంగా తీర్థ బిందె పూజలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో గురువారం తీర్థ బిందె కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 18, 2026
ATP: రేపటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభంకానుంది. అనంతపురం జిల్లాలో రేపటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
☞ గుత్తిలో….
★ సహర్: ఉ.5-5.21
★ ఇఫ్తార్: సా.6.29
★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.
News February 18, 2026
GWL: ప్రతిభ చాటిన విద్యార్థులకు కలెక్టర్ అభినందన

రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ఐడిఓసి మందిరంలో అభినందించారు. హైదరాబాద్ దోమలగూడ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఈనెల 17న సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గద్వాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. విష్ణు అనే విద్యార్థి లాంగ్ జంప్ లో మొదటి స్థానం, షాట్ పుట్‌లో రెండో స్థానం సాధించాడు.
News February 18, 2026
తిన్న తర్వాత 10 నిమిషాల నడకతో షుగర్ వ్యాధికి ఫుల్ స్టాప్!

భోజనం తర్వాత 10 ని.లు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని లైఫ్‌స్టైల్ కోచ్‌లు అంటున్నారు. ఈ చిన్న అలవాటు రక్తంలో షుగర్ లెవెల్స్ సడన్‌గా పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇన్సులిన్ రెస్పాన్స్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఎక్కడైనా చేయగలిగే ఈ 10 నిమిషాల నడక దీర్ఘకాలంలో టైప్-2 డయాబెటిస్ ముప్పును తప్పిస్తుంది.


