News August 11, 2025

భద్రాచలంలో వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో సోమవారం నిత్య కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు కళ్యాణాన్ని వీక్షించి తరించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ జరిగిన కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. ఈ మహోత్సవంలో పాల్గొనడం పుణ్యప్రదమని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News March 12, 2026

ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు: మంత్రి రాజనర్సింహ

image

మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘వుమెన్ వెల్నెస్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మహిళలందరికీ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

News March 12, 2026

అనకాపల్లి జిల్లాలో వినూత్న కార్యక్రమం.. సీఎం ప్రశంసలు

image

అనకాపల్లి జిల్లాలో 114 ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలలను జీరో వేస్ట్ స్కూల్స్ గా మారుస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ చేసిన వినూత్న కార్యక్రమం సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకుంది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో జీరో వేస్ట్ స్కూల్స్‌లో చెత్త నుంచి సంపద సృష్టిపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

News March 12, 2026

23న ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన: CM

image

APలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు CM CBN ప్రకటించారు. ఈ కార్యక్రమానికి PM మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రూ.1.35 లక్షల కోట్లతో 2 దశల్లో 5,300 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే.