News August 23, 2025
భద్రాచలం: మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు 38 అడుగులు వద్ద గోదావరి నీటిమట్టం ప్రవహిస్తూ ఉంది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరిలో స్నానాలకు, ఈత కొట్టడానికి, చేపల వేటకు ఎవరు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News January 20, 2026
ఈపూరుపాలెం పీహెచ్‌సీలో మలేరియా అధికారి తనిఖీ

ఈపూరుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి వి.నాగార్జునరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్ రికార్డులు పరిశీలించి, రక్త పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో దోమల నివారణకు చేపట్టిన మలాథియన్ స్ప్రేయింగ్ పనులను ఆయన పర్యవేక్షించారు.
News January 20, 2026
షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News January 20, 2026
NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


