News March 9, 2025
భద్రాచలం: యువతిపై దాడి.. తలకు తీవ్రగాయాలు

పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ దుకాణం వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా ఓ యువతిపై తన సమీప బంధువు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సదరు యువతి తలని అక్కడే దుకాణంలో ఉన్న గాజు అద్దానికి బలంగా కొట్టడంతో అద్దం ముక్కలు ముక్కలు కాగా యువతి తలకి బలమైన గాయమైంది. అక్కడే ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు అవ్వలేదని పోలీసులు తెలిపారు.
Similar News
News January 15, 2026
ఏలూరులో ఎండ్ల బండిపై ఎస్పీ దంపతుల సందడి

ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో పోలీసు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
News January 15, 2026
TODAY HEADLINES

⁎ తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు
⁎ జర్నలిస్టుల అరెస్ట్.. ఖండించిన బండి సంజయ్, YS జగన్, KTR
⁎ శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
⁎ ఢిల్లీలో పొంగల్ వేడుకలు.. పాల్గొన్న పీఎం మోదీ
⁎ రూ.15,000 పెరిగిన వెండి ధర
⁎ రెండో వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం
⁎ ఇరాన్‌ను వీడాలని భారతీయులకు ఎంబసీ సూచన
News January 15, 2026
WPL: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ (36) శుభారంభం ఇవ్వగా, లిజెల్లీ లీ (67) చెలరేగి ఆడి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ, ఈ గెలుపుతో టోర్నీలో తన ఖాతాను తెరిచింది.


