News November 19, 2025

భద్రాచలం రామయ్య హుండీ ఆదాయం రూ.1.61 కోట్లు

image

భద్రాచలంసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. రూ.1,61,02,694 నగదు, 141 గ్రాముల బంగారం, 850 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు ఈవో దామోదర్‌రావు తెలిపారు. అమెరికా, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా డాలర్లు సహా పలు దేశాలకు చెందిన నోట్లు, నాణేలు లభించాయని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Similar News

News January 15, 2026

కామారెడ్డి: మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

image

కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు తేల్చారు. మొత్తం 92 వార్డులు ఉండగా అందులో మహిళలకు 45 వార్డులు కేటాయించారు. అన్‌రిజర్వుడ్ పరిధిలో 47 వార్డులుండగా మహిళలకు 26 వార్డులు, బీసీలకు 31 వార్డులు రిజర్వ్ చేయగా మహిళలకు 14, ఎస్సీలకు 10 వార్డులు కేటాయించగా మహిళలకు 5 వార్డులు అయ్యాయి. ఎస్టీలకు 4 వార్డులు కేటాయించగా ఇన్నీ జనరలే రిజర్వ్ అయ్యాయి. ఇక వార్డుల వారీగా రిజర్వేషన్లు తేలాల్సి ఉంది.

News January 15, 2026

డోన్: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

డోన్ మం. దొరపల్లె రైల్వే గేట్ సమీపంలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు చిట్యాలకు చెందిన తలారి మధుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News January 15, 2026

ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: మోదీ

image

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా వైభవంగా జరుపుకొనే ఈ వేడుక అందరి హృదయాల్లో ఆనందాన్ని, కృతజ్ఞతా భావాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉండే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలో సుఖ శాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగులో ట్వీట్ చేశారు.