News August 14, 2025

భద్రాచలం: స్వల్పంగా పెరిగిన గోదావరి వరద

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. భద్రాచలంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకూ నీటిమట్టం 20.10 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1,80,455 క్యూసెక్కుల వరదనీరు దిగువ ప్రాంతాలకు విడుదల అవుతోందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Similar News

News March 13, 2026

పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

image

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుక్రవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకొని, పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News March 13, 2026

రూటు మార్చిన పవన్.. ఆదివాసీల మధ్య వేడుకలు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న స్థాపించిన జనసేన పార్టీ రేపటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈసారి వేడుకలను తొలుత పిఠాపురంలో నిర్వహించాలని భావించినప్పటికీ, వివిధ కారణాలతో రద్దు చేశారు. అనంతరం ASR జిల్లా పాడేరు సమీప నందిగురువులో కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. ‘మాటా-మంతి’ కార్యక్రమంలో గిరిజనులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు.

News March 13, 2026

HYDలో ‘హైడ్రా’కు సుప్రీం పవర్స్

image

హైడ్రాకు చట్టబద్ధమైన అధికారాలు కల్పించే ‘హైడ్రా చట్టం-2026’ ఈ బడ్జెట్ సెషన్‌లోనే ఆమోదం పొందనుంది. దీని ప్రకారం చెరువులు, నాలాల ఆక్రమణల విషయంలో హైడ్రా ఇచ్చే నోటీసులే తుది నిర్ణయంగా మారుతాయి. సివిల్ కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు రాకుండా మున్సిపల్ చట్టాల్లో కీలక సవరణలు చేస్తున్నారు. బడ్జెట్‌లో హైడ్రాకు అదనంగా ₹500 కోట్లు కేటాయించి సొంతంగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీస్ ఫోర్స్’ను ఏర్పాటు చేయబోతున్నారు.