News November 16, 2025

భద్రాచల ట్రైబల్ మ్యూజియం ఆకర్షణీయం: మంత్రి అడ్లూరి

image

భద్రాచలం: ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం గిరిజన సాంప్రదాయాల ప్రతిబింబంగా విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. భద్రాచలంలో దర్శనానంతరం మ్యూజియాన్ని వీక్షించిన మంత్రి, త్వరలో కుటుంబంతో సహా సందర్శిస్తానని తెలిపారు. ఈ మ్యూజియం రాష్ట్ర ఉత్తమ మ్యూజియంగా అవార్డు పొందిందని, అధికారులు గిరిజన సంక్షేమ పథకాల అమలులో శ్రద్ధ చూపాలన్నారు.

Similar News

News January 19, 2026

ట్రంప్‌కు ఈయూ షాక్ ఇవ్వనుందా..!

image

గ్రీన్‌లాండ్ డీల్‌ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్ <<18885220>>విధించడాన్ని<<>> యూరోపియన్ యూనియన్ (EU) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాలు విధించాలని భావిస్తోంది. ఈయూ చరిత్రలో తొలిసారిగా ‘ట్రేడ్ బజూకా’ను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి అదనంగా 93 బిలియన్ యూరోల(రూ.9.8 లక్షల కోట్లు) ప్రతీకార టారిఫ్స్ విధించడాన్ని ఈయూ పరిశీలిస్తోందని రాయిటర్స్ ఏజెన్సీ తెలిపింది.

News January 19, 2026

అసలేంటీ ‘ట్రేడ్ బజూకా’!

image

తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 2023లో ‘ట్రేడ్ బజూకా’(బెదిరింపుల వ్యతిరేక సాధనం-ACI)ను EU అమల్లోకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక బెదిరింపులు, బలవంతపు వాణిజ్య పద్ధతుల నుంచి తమ రక్షణ కోసం రూపొందించింది. కౌంటర్ టారిఫ్స్, దిగుమతులపై ఆంక్షలు, యూరోపియన్ మార్కెట్లలోకి ఆయా దేశాల యాక్సెస్‌ను, పెట్టుబడులను నియంత్రించడం, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ చేయడం వంటి పవర్స్ దీనికి ఉంటాయి.

News January 19, 2026

JGTL: మున్సిపల్ పోరు.. జీవన్ వర్సెస్ సంజయ్!

image

JGTLలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య వార్ పీక్ స్టేజికి చేరింది. దీంతో తమకు బీఫామ్ ఇచ్చే నేత ఎవరో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోవడంతో ఏ డివిజన్ టికెట్ ఎవరు ఫైనల్ చేస్తారో తెలియక స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. JGTL మున్సిపల్‌లో 50 డివిజన్స్ ఉండగా.. 94,800 మంది ఓటర్లు ఉన్నారు.