News November 30, 2025
భద్రాద్రిలో రెండో విడత తొలి రోజు 67 నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఆదివారం 7 మండలాల్లో ప్రారంభమైంది. మొత్తం 155 గ్రామ పంచాయతీలకు గాను, తొలి రోజున 21 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, 1384 వార్డులకు గాను 46 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 19, 2026
పీఎం కేర్స్ ఫండ్.. 12 మంది పిల్లలకు రూ.10 లక్షల డిపాజిట్!

కోవిడ్ మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన 12 మంది అనాథ పిల్లలకు ‘పీఎం కేర్స్ ఫండ్’ ద్వారా అండగా నిలుస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. గురువారం అమలాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన గార్డియన్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 మార్చి 11 నుంచి 2021 డిసెంబర్ 31 మధ్య కాలంలో తల్లిదండ్రులు లేదా రక్షకులను కోల్పోయిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కార్పస్ డిపాజిట్ అందిస్తుందని వివరించారు.
News February 19, 2026
వచ్చే నెల 3న శ్రీశైల ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న ఉదయం 6 నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీశైలం ఆలయాన్ని మూసి వేయనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ కారణంగా ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీ స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవ టికెట్లు పూర్తిగా నిలుపుదల చేశామన్నారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం రాత్రి 9 నుంచి 10:30 గంటల వరకు భక్తులను స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తామన్నారు.
News February 19, 2026
పార్వతీపురం: ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో శతశాతం సుఖ ప్రసవాలు జరగాలి’

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శతశాతం సుఖ ప్రసవాలు జరగాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి వైద్యులకు స్పష్టం చేశారు. గురువారం పార్వతీపురం జిల్లాలోని ఆసుపత్రుల పనితీరుపై సమావేశం ఏర్పాటు చేశారు. సుఖ ప్రసవాలు జరిగేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, సిజేరియన్ కేసులకు గల సైంటిఫిక్ కారణాలను తెలుసుకొని, వాటిని నివారించే దిశగా కృషిచేయాలని వైద్యులను కోరారు.


