News February 23, 2025
భద్రాద్రి: ‘కేసుల విచారణలో జాప్యం చేయొద్దు’

పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆయన కార్యాలయం నుంచి వీసీలో పాల్గొన్నారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని వారు సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
Similar News
News March 26, 2025
వాట్సాప్, గూగుల్ మ్యాప్స్‌తో దొంగడబ్బు కనిపెట్టిన Income Tax

ఎగవేతదారులు, బినామీలు, దాచిన డబ్బు, క్రిప్టో అసెట్స్‌ను గుర్తించడానికి Income Tax సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. వాట్సాప్, ఇన్‌స్టా, గూగుల్ మ్యాప్స్‌ను విశ్లేషించి వాటిని కనిపెట్టేస్తోంది. ఎగవేసిన ₹200CRను WA ఎన్‌క్రిప్టెడ్ మెసేజుల ఆధారంగా గుర్తించిన వైనాన్ని పార్లమెంటులో FM నిర్మల వివరించారు. G Maps ద్వారా డబ్బు దాచిన చోటు, Insta ద్వారా బినామీ ప్రాపర్టీ ఓనర్‌షిప్‌ను కనిపెట్టామని తెలిపారు.
News March 26, 2025
జుక్కల్: పదో తరగతి ప్రశ్నలు లీక్

పదో తరగతి గణిత పరీక్షకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు లీకైన ఘటన జుక్కల్‌లోని ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ఓ విద్యార్థి గణితం ప్రశ్నలు పేపర్‌పై రాసి బయటకు పారేశాడు. ఈ లీకైన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం వెలుగులోకి రావడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, DEO రాజు పరీక్ష కేంద్రానికి చేరుకొని ఘటనపై విచారణ చేస్తున్నారు.
News March 26, 2025
నెల్లూరు: ఉచిత DSC కోచింగ్‌కి ఎంపికైన వారి వివరాలివే.!

నెల్లూరు జిల్లాలో ఉచిత DSC కోచింగ్‌కి ఎంపికైన S.C, S.T అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను కింది 2 వెబ్సైట్‌లలో పొందుపరిచారు. కాబట్టి DSC ఉచిత కోచింగ్‌కి దరఖాస్తు చేసుకున్న వారు చెక్ చేసుకోవాలని, నెల్లూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి తెలియజేశారు.
➤ https://mdfc.apcfss.in
➤https://jnanbhumi.ap.gov.in