News October 6, 2025

భద్రాద్రి కొత్తగూడెం: పోలీస్ శాఖలో విషాదం.. ఏసీపీ మృతి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండెపోటుతో జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఏసీపీ సుబ్బతి విష్ణుమూర్తి (42) ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన హైదరాబాద్‌లో ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రి తన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. విష్ణుమూర్తి మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News January 24, 2026

కాకినాడ: 26న పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు

image

ప్రతి సోమవారం ప్రజా సమస్యల నిమిత్తం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఈనెల 26వ తేదీన రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లాలో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా వాసులు గమనించాలని కోరారు.

News January 24, 2026

HYD: పిల్లల స్కూల్ ఫీజు 140% పెరిగింది సీఎం సార్!

image

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్‌లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.