News August 21, 2025
భద్రాద్రి: జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

పాల్వంచ(M) కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వై.రుషివర్మ, కె.వెంకన్నబాబు జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. HYDలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వారు తమ ప్రతిభ చాటడంతో ఈ నెల 26, 27 తేదీలలో ఫుణేలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొననున్నారని HM చందు తెలిపారు. ఈ పోటీలలో విజయం సాధిస్తే, వారు ఇండియా జట్టు తరఫున చైనాలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు.
Similar News
News January 19, 2026
గద్వాల్: 255 సర్పంచ్‌లకు 5 రోజుల పాటు శిక్షణ

గద్వాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన 255 మంది సర్పంచ్‌లకు నేటి నుంచి ప్రభుత్వం 5 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించనున్నది. పారిశుద్ధ్యం, గ్రామసభలు, సమావేశాలు, వన మహోత్సవం, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, ప్రజా ఆరోగ్యం, నిధుల ఆడిట్, జనన, మరణాల నమోదు, ఆర్థిక ప్రణాళిక, ఈ -అప్లికేషన్స్ లాంటి 24 అంశాలపై శిక్షణ ఇవ్వడానికి ఎర్రవల్లి మండలం పదో బెటాలియాన్‌లో అధికారులు ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు.
News January 19, 2026
నల్గొండ: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

గట్టుప్పల్ మండలంలోని అంతంపేటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన విద్యార్థిని నవ్య పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని నల్గొండలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె, తిరిగి హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక పురుగు మందు తాగింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
News January 19, 2026
మేడారంలో కొబ్బరికాయల సిండికేట్ మాఫియా!

మేడారం జాతరలో కొబ్బరికాయలు, బెల్లం, తలనీలాల కాంట్రాక్టుల్లో సిండికేట్ మాఫియా చక్రం తిప్పుతోంది. టెండర్లు లేకుండా కొబ్బరి కాయలను డబుల్ రేట్లకు రూ.60 చొప్పున జాతరలో విక్రయించడానికి నిర్ణయించారు. దాదాపు 60 లక్షల కొబ్బరికాయలు జాతరలో అమ్ముడవుతాయని అంచనా. కొబ్బరికాయల రూపంలో రూ.18 కోట్లు, తలనీలాలు రూ.15 కోట్లు, బెల్లం పేరిట రూ.30 కోట్లు టెండర్లు లేకుండా మాఫియా జేబులోకి వెళుతోందని తెలుస్తోంది.


