News October 6, 2025
భద్రాద్రి జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం 8:30 వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. దమ్మపేట 79.5 మి.మీ, టేకులపల్లి 76.3, అశ్వరావుపేట 48.8, లక్ష్మీదేవి పల్లి 38.8, చుంచుపల్లి 35.3, పాల్వంచ 30.5, కొత్తగూడెం 23.3, ములకలపల్లి 17.8, అన్నపురెడ్డిపల్లి 16.8, బూర్గంపాడు 4.5, భద్రాచలం 3, గుండాల 1.5, ఆళ్లపల్లి 0.8 మి.మీల వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు.
Similar News
News January 15, 2026
NZB: మున్సిపల్ రిజర్వేషన్లు ఇలా..

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా STకి ఒకే ఒక్క స్థానం దక్కింది.
1.నిజామాబాద్ కార్పొరేషన్- ST(G)-1, SC(G)-3, W-2, BC(G)-12, W-12 UR(G)-14, W-16
2.బోధన్- ST(G)-1, SC(G)-2, W-1 BC(G)-8, W-7 UR(G)8-, W-11
3.ఆర్మూర్- ST(G)-1, SC(G)-2 W-1, BC(G)-7, W-7 UR(G)-8, W-10
4.బీమ్‌గల్- ST(G)-1, SC(G)-1 W-1, BC(G)-2, W-1 UR(G)-2, W-4
News January 15, 2026
కామారెడ్డి: మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు తేల్చారు. మొత్తం 92 వార్డులు ఉండగా అందులో మహిళలకు 45 వార్డులు కేటాయించారు. అన్‌రిజర్వుడ్ పరిధిలో 47 వార్డులుండగా మహిళలకు 26 వార్డులు, బీసీలకు 31 వార్డులు రిజర్వ్ చేయగా మహిళలకు 14, ఎస్సీలకు 10 వార్డులు కేటాయించగా మహిళలకు 5 వార్డులు అయ్యాయి. ఎస్టీలకు 4 వార్డులు కేటాయించగా ఇన్నీ జనరలే రిజర్వ్ అయ్యాయి. ఇక వార్డుల వారీగా రిజర్వేషన్లు తేలాల్సి ఉంది.
News January 15, 2026
డోన్: రైలు కింద పడి వ్యక్తి మృతి

డోన్ మం. దొరపల్లె రైల్వే గేట్ సమీపంలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు చిట్యాలకు చెందిన తలారి మధుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


