News November 8, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓అన్నపురెడ్డిపల్లి: పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
✓దమ్మపేట: కలప పట్టివేత
✓ఫర్నిచర్ శిక్షణకు 11 మంది ఎంపిక: కలెక్టర్
✓ఇల్లందు, భద్రాచలం ఆసుపత్రి సేవలు భేష్.. CRM బృందం నివేదిక
✓మణుగూరు పార్టీ ఆఫీస్ కాంగ్రెస్‌దే: INTUC
✓రైతాంగ సమస్యలపై ఈనెల 12న గ్రామీణ బంద్: CPI(ML)
✓కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం
✓మాదకద్రవ్యాలు జీవితాలను నాశనం చేస్తాయి: ఆళ్లపల్లి ఎస్సై
Similar News
News January 18, 2026
జాతీయ స్థాయి కబడ్డీకి పాలమూరు విద్యార్థినులు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) అండర్-19 విభాగంలో జిల్లాకు చెందిన శివాని, భవాని, మౌనిక జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో రేపటి నుంచి జరిగే ఈ టోర్నీలో వీరు పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదాబాయి తెలిపారు. పాలమూరు క్రీడామణులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News January 18, 2026
వనదేవతలను దర్శించుకున్న డీజీపీ

మేడారం సమ్మక్క, సారలమ్మను డీజీపీ శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన మేడారం చేరుకుని, వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు స్థానిక ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మేడారం భద్రత, క్రౌడ్ కంట్రోల్ తదితర విషయాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌లో డీజీపీకి వివరించారు. మేడారం జాతర విజయవంతం చేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
News January 18, 2026
ఆ 88 గంటలు.. తీవ్రతను మాటల్లో వర్ణించలేం: రాజ్‌నాథ్

గతేడాది పాక్ ఉగ్ర శిబిరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ 88 గంటలు కొనసాగిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. అప్పుడు ఎదుర్కొన్న తీవ్రతను మాటల్లో వర్ణించలేమని అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రతి నిమిషం, నిర్ణయం చాలా కీలకమని తెలిపారు. ‘ప్రపంచంలో యుద్ధ రీతులు మారుతున్నాయి. కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఇప్పుడు అవి సరిహద్దులకే పరిమితం కాదు’ అని నాగ్‌పూర్‌లో మందుగుండు సామగ్రి ప్లాంట్ ప్రారంభోత్సవంలో అన్నారు.


