News December 1, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ రేపు కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్న సీఎం
✓ పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన వ్యయ పరిశీలకులు
✓ దమ్మపేట: విద్యుత్ షాక్ తో డ్రిల్లింగ్ ఆపరేటర్ మృతి
✓ ఆళ్లపల్లి: అక్రమ టేకు కలప పట్టివేత
✓ అశ్వరావుపేట: పొదల్లోకి దూసుకెళ్లిన సిమెంట్ మిక్సర్
✓ సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు: రేగా
✓ సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల

Similar News

News February 16, 2026

మెదక్: మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా: ఎస్పీ

image

మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూప్రాన్ మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో 163 BNSS ( సెక్షన్ 144) ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.

News February 16, 2026

గద్వాల: మూడు తరాలు.. ఒకే కుటుంబం.. తుమ్మల వారి అరుదైన రికార్డు!

image

గద్వాల మున్సిపల్ రాజకీయంలో ‘తుమ్మల’ కుటుంబం సరికొత్త చరిత్ర సృష్టించింది. 1988లో మామ, 2000లో అత్త, 2014లో భర్త కౌన్సిలర్లుగా ఎన్నికవ్వగా.. ఇప్పుడు అదే వారసత్వంతో తుమ్మల జయలక్ష్మి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 30 ఏళ్లుగా మూడు తరాలుగా విజయం సాధిస్తూ ఈ కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

News February 16, 2026

12 ఏళ్లకే వండర్ చేశాడు

image

Phd విద్యార్థుల కలను ఏడో తరగతి విద్యార్థి మెక్‌మిలన్(12) సాధించాడు. US డల్లాస్‌లో చిన్న ప్లేరూమ్‌లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను నిర్మించాడు. 8 ఏళ్లకే న్యూక్లియర్ ఫిజిక్స్‌పై ఆసక్తి పెంచుకున్న చిన్నోడు ఓ సంస్థ సాయంతో ఈ ప్రాజెక్టును నిర్మించాడు. శాస్త్రీయ ఆవిష్కరణలకు వయసుతో సంబంధం లేదని చాటాడు. 2 తేలికైన పరమాణు కేంద్రకాలు కలిసి బలమైన కేంద్రకంగా మారినప్పుడు భారీగా శక్తి విడుదలవ్వడమే ఈ ప్రక్రియ.