News May 7, 2025
భద్రాద్రి: దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టేకులపల్లి మండలం రేగులతండాలో పురుగు మందు తాగి దంపతులు దీపిక, శ్రీను ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 9, 2026
పట్టణాల్లో జీ ప్లస్ 3, 5 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు!

TG: పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను జీ ప్లస్ 3, 5 టవర్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఒక్కో టవర్‌లో 12 ఇళ్లు ఉండేలా నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి 19 స్థలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్) నుంచి నిర్మాణాలు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు హౌసింగ్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.
News February 9, 2026
జంద్యం ధరిస్తున్నారా?

జంద్యం పొడవు వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది. ఇది జాగరణ, స్వప్న, సుషుప్తి, తురీయ అనే 4 ఆత్మ స్థితులను సూచిస్తుంది. దీనిని ధరించే విధానంలో 3 రకాలు ఉన్నాయి. శుభ కార్యాల్లో ఎడమ భుజంపై(సవ్యం), అశుభ కార్యాల్లో కుడి భుజంపై(ప్రాచీనావీతి), మలమూత్ర విసర్జన సమయంలో మెడలో దండలా(నివీతం) ధరించాలి. ఏటా శ్రావణ పూర్ణిమ లేదా జంద్యాల పూర్ణిమ నాడు కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
News February 9, 2026
HYDలో తీవ్ర విషాదాలు..!

HYDలో వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. చర్లపల్లిలో పిల్లలతో కలిసి విజయారెడ్డి డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. దీనికి ముందు యువతి డిప్రెషన్‌తో ట్యాంక్‌బండ్‌లో దూకింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీశ్ పనిఒత్తిడితో ఉరేసుకున్నాడు. కూకట్‌పల్లిలో వివాహిత అనిత అనారోగ్యంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. ఒత్తిడికి గురైతే పిల్లలు, తల్లిదండ్రులతో గడపాలని నిపుణులు చెబుతున్నారు.


