News November 30, 2025
భద్రాద్రి: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పరిశీలకులు

జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్, స్క్రూటినీ ప్రక్రియల పారదర్శక నిర్వహణను సమీక్షించేందుకు ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య పలు మండలాల్లో పర్యటించారు. ఆమె చంద్రుగొండ, రావికంపాడు, దామరాచర్ల, గానుగపాడు పంచాయతీలతో పాటు చుంచుపల్లి, విద్యానగర్ కాలనీ, 3, 4 ఇంక్లైన్ జీపీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు.
Similar News
News February 9, 2026
కల్తీ నెయ్యి వ్యవహారం.. కేసు నమోదు చేసిన ఈడీ

AP: తిరుమల కల్తీ నెయ్యి <<18933854>>వ్యవహారం<<>>లో హవాలా ద్వారా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణల నేపథ్యంలో ED రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ECIR) నమోదు చేసింది. ₹235 కోట్ల అక్రమాలు జరిగాయని, ₹20 కోట్లకు పైగా హవాలా జరిగిందని ఛార్జ్‌షీట్‌లో CBI పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ముడుపులు అందుకున్న వారికి, ఏజెంట్లకు త్వరలో ED నోటీసులు జారీచేసే అవకాశం ఉందని సమాచారం.
News February 9, 2026
ఏలూరు: ‘మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టారు’

‘మీసాలపై నిమ్మకాయలు నిలబెడతాం’ అనే నానుడిని జీలకర్రగూడేనికి చెందిన బాహుబలేంద్రుని బాలవర్ధిరాజు అక్షరాలా నిజం చేసి చూపించారు. సినీ నటుడైన ఆయన, వృత్తిరీత్యా పొడవాటి మీసాలు పెంచడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. భారీ మీసాలను మెలితిప్పి, వాటిపై నిమ్మకాయలను నిలబెట్టి చూపిస్తున్న ఆయన విన్యాసం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 1958లో శివాజీ గణేశన్ నటించిన ‘వీరప్రతాప 1940’ సహా పలు చిత్రాల్లో నటించారు.
News February 9, 2026
శ్రీకాకుళం: టెన్త్ విద్యార్థులకు గమనిక

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఎగ్జామ్స్‌లో ఓ పరీక్ష తేదీని మార్చినట్లు డీఈవో రవి కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిషు పరీక్ష, ఆ రోజు రంజాన్ కావడంతో మరుసటి రోజు 21న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మార్పును టీచర్లు, విద్యార్థులు గమనించాలన్నారు.


