News September 10, 2025

భద్రాద్రి: నేడు, రేపు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు సెలవు

image

దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేటలో గల రెండు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు వరుసగా రెండు రోజులు పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వారం రోజులు ఫ్యాక్టరీలకు ఆయిల్‌పామ్ గెలలు అధికంగా వచ్చాయని అన్నారు. ఈ కారణంగా బుధవారం, గురువారం గెలలు కొనబోమని పేర్కొన్నారు. తిరిగి శుక్రవారం నుంచి గెలలు యథావిధిగా కొంటామని, రైతులు సహకరించాలని కోరారు.

Similar News

News December 8, 2025

సిద్దిపేట: ఈ ప్రాంతాల్లో సెక్షన్163 అమలు: సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు (మొదటి దశ) ప్రశాంతంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు సెక్షన్ 163 BNSS, 2023 అమలులో ఉంటుందని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 12 ఉదయం 7 గంటల వరకు దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవపూర్, మార్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్‌లో అమలులో ఉంటుందన్నారు.

News December 8, 2025

తిరుపతి: నేడు కీలక కేసుల విచారణ

image

తిరుపతి వేదికగా సాగుతున్న పలు కీలక కేసులు సోమవారం కోర్టులో విచారణకు రానున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నెల్లూరు ACB కోర్టులో ఏ-16 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్, ఏ-29 సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ విచారణ జరగనుంది. మరో వైపు హై కోర్టులో పరకామణీ కేసు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

News December 8, 2025

TVK సభకు పోలీసుల ఆంక్షలు.. 5వేల మందికే పర్మిషన్

image

TVK పార్టీ చీఫ్ విజయ్ రేపు పుదుచ్చేరిలో నిర్వహించే సభకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. TVK ఇష్యూ చేసిన QR కోడ్ పాసులున్న 5వేల మంది స్థానికులనే సభకు అనుమతిస్తామన్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఎంట్రీ లేదని చెప్పారు. సభ వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఏర్పాటు చేసుకోవాలని పార్టీని ఆదేశించారు. కరూర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.