News November 19, 2025

భద్రాద్రి: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తులసీరాం ఆత్మహత్య

image

పినపాక మండలం ఈ బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తులసీరాం బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. తులసీరాం మృతి పట్ల ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వినితో పాటు కార్యాలయ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలియజేశారు.

Similar News

News January 16, 2026

జనగామ: గాదె ఇన్నయ్యకు తాత్కాలిక బెయిల్ మంజూరు

image

జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌కు చెందిన గాదె ఇన్నయ్యకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి మరణించారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాదె ఇన్నయ్యకు కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదల కానున్నారు.

News January 16, 2026

రేపు మేడారం ట్రస్ట్ బోర్డు ఛైర్‌పర్సన్ ప్రమాణస్వీకారం

image

మేడారం ట్రస్ట్ బోర్డ్ ఛైర్‌పర్సన్‌గా తాడ్వాయి మండలానికి చెందిన ఈర్పా సుకన్యను ప్రభుత్వం నామినేట్ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు మేడారంలోని సమ్మక్క భవన్‌లో ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News January 16, 2026

జగిత్యాల కలెక్టరేట్‌లో విద్యా ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

image

జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌లో TGMREIS ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ టి. సుచిత్ర పాల్గొని, అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.