News November 19, 2025
భద్రాద్రి: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తులసీరాం ఆత్మహత్య

పినపాక మండలం ఈ బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తులసీరాం బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. తులసీరాం మృతి పట్ల ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వినితో పాటు కార్యాలయ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలియజేశారు.
Similar News
News January 17, 2026
నవ గ్రహాలు వాటి ప్రత్యధి దేవతలు

ఆదిత్యుడు – రుద్రుడు
చంద్రుడు – గౌరి
అంగారకుడు – క్షేత్రపాలకుడు
బుధుడు – నారాయణుడు
గురు – ఇంద్రుడు
శుక్రుడు – ఇంద్రుడు
శని – ప్రజాపతి
రాహువు – పాము
కేతువు – బ్రహ్మ
News January 17, 2026
BECILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 3పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి PG (జెనిటిక్స్, హ్యూమన్ జీనోమిక్స్, కౌన్సెలింగ్/లైఫ్ సైన్సెస్), MSc/MTech (బయోఇన్ఫర్మాటిక్స్/జీనోమిక్స్, మైక్రో బయాలజీ), PhDతో పాటు పనిఅనుభవం గలవారు JAN 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.becil.com
News January 17, 2026
నందిగామ Y జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

నందిగామ వై-జంక్షన్ వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి సెలవులు ముగియడం, ఆదివారం అమావాస్య కావడంతో ప్రయాణికులు ముందుగానే HYD బాట పట్టారు. వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో పోలీసులు తాత్కాలిక ఫ్లైఓవర్ ద్వారా రాకపోకలకు అనుమతించినా ఫలితం లేకపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


