News November 19, 2025

భద్రాద్రి: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తులసీరాం ఆత్మహత్య

image

పినపాక మండలం ఈ బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తులసీరాం బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. తులసీరాం మృతి పట్ల ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వినితో పాటు కార్యాలయ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలియజేశారు.

Similar News

News January 22, 2026

కోనసీమకు తొలిసారిగా 216-ఇ పేరుతో జాతీయ రహదారి

image

కోనసీమకు తొలిసారిగా 216-ఇ పేరుతో జాతీయ రహదారి రానుంది. ఇందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూ.630 కోట్ల నిధులు మంజూరు చేసింది. అమలాపురం-ఈదరపల్లి వంతెన నుంచి మొసలపల్లి, ముక్కామల, అవిడి, ఖండ్రిగ, పలివెల, వెదిరేశ్వరం మీదుగా 22 గ్రామాల పరిధిలో 31.6 కిలో మీటర్ల మేర హైవే నిర్మాణం చేపట్టనున్నారు. భూసేకరణ కోసం 55.98 హెక్టార్ల భూమిని 727 మంది రైతులు, గృహ యజమానుల నుంచి సేకరించనున్నారు.

News January 22, 2026

ప.గో: ‘అమరజీవి జలధార’కు రూ.1,400 కోట్లు

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించే ‘అమరజీవి జలధార’ పథకానికి రూ.1,400 కోట్లు మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్‌, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డెల్టా ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందించామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.