News November 19, 2025
భద్రాద్రి: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తులసీరాం ఆత్మహత్య

పినపాక మండలం ఈ బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తులసీరాం బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. తులసీరాం మృతి పట్ల ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వినితో పాటు కార్యాలయ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలియజేశారు.
Similar News
News January 19, 2026
మంచిర్యాల: ఆ ముగ్గురు ఎవరు..?

జిల్లాలోని 302 గ్రామపంచాయతీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ప్రతి పంచాయతీకి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండటంతో రాజకీయ సందడి మొదలైంది. ముఖ్యంగా ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈ పదవుల ద్వారా ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. 306 పంచాయతీలు ఉన్న జిల్లాలో, ఎన్నికలు ముగిసిన చోట్ల ఆశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు ముమ్మరం చేశారు.
News January 19, 2026
కామారెడ్డి: జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి ప్రభావం తీవ్రమవుతోంది. సోమవారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం జిల్లాలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 10.8°Cగా నమోదైంది. ముఖ్యంగా మాచారెడ్డి (లచ్చపేట)లో 12.3°C, జుక్కల్‌లో 12.3°C, గాంధారి (రామలక్ష్మణపల్లి)లో 12.8°C, ఎల్లారెడ్డి (మాచాపూర్)లో 13.7°C, దోమకొండలో 13.7°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 19, 2026
YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.


