News December 2, 2025
భద్రాద్రి: సీఎం రాక.. సమస్యలపై స్పందిస్తారో చూడాలి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. నిధుల కొరతతో నిలిచిన సీతారామ ప్రాజెక్టు పనులు, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సత్తుపల్లి ఫుడ్‌పార్క్ సమస్యలపై సీఎం కీలక ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. నేటి పర్యటనలో ఆయన జిల్లాకు ముఖ్య నిర్ణయాలు ప్రకటిస్తారో లేదో అని జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News February 10, 2026
గన్నవరం: సచివాలయ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

గన్నవరం మండలం కొండపావులూరులో స్థానిక సచివాలయ మహిళా కానిస్టేబుల్ లలిత ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News February 10, 2026
US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

H-1B వీసా ప్రోగ్రామ్ రద్దు చేసే బిల్లును రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమెరికాలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అమెరికన్ల కంటే విదేశీ కార్మికులకు కార్పొరేట్లు ప్రాధాన్యం ఇస్తుండటం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని వాపోయారు. కాగా H1B వీసా పొందుతున్నవారిలో 80 శాతం మంది భారత్, చైనాకు చెందిన వారే ఉండటం గమనార్హం.
News February 10, 2026
కరీంనగర్‌లో 23 ప్రత్యేక బృందాలతో నిఘా

ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు 23 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ఎన్నికల ఉల్లంఘనలపై ప్రజలు 87126 70744, 87126 70745 నంబర్లకు లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.


