News February 10, 2025

భద్రాద్రి: 50 ఏళ్లుగా మోటారు లేకున్నా నీటి సదుపాయం

image

భద్రాద్రి జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామంలో వేసిన బోరులో భగీరథుడే ఉన్నట్లు నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. ఊరిలో నీళ్ల కరవుందని 50 ఏళ్ల కింద బోరు వేశారు.. మోటారు బిగిద్దామనుకుంటే నీళ్లు ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. తమ తాతల కాలం నుంచి నీళ్లు పైకి వస్తున్నాయని అంటున్నారు. పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ నీళ్లనే వాడుకుంటున్నారు.

Similar News

News April 16, 2026

‘కంకణం కట్టుకోవడం’ వెనుక ఎంతో అర్థం

image

ఒక పనిని కచ్చితంగా, దృఢ సంకల్పంతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పే సందర్భంలో ‘కంకణం కట్టుకోవడం’ అనే జాతీయాన్ని వాడతాం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలకు ముందు మణికట్టుకు కంకణ ధారణ చేస్తారు. ఇది మూడు/ఐదు పోగులతో ఉంటుంది. దీన్ని మామిడాకు/తమలపాకు/పసుపుకొమ్ముతో అలంకరిస్తారు. ఇలా చేస్తే ఆ కార్యం విజయవంతంగా పూర్తయ్యేందుకు సర్వేశ్వరుడు రక్షణగా ఉంటారని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 16, 2026

శాతవాహన వర్సిటీ ఈసీ సభ్యుల నియామకం

image

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. సభ్యులుగా ప్రొఫెసర్ జాఫర్ జరీ, ప్రిన్సిపల్స్ రమాకాంత్, భిక్షపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హరికాంత్, లెక్చరర్ రజిత నియమితులయ్యారు. ప్రముఖుల కోటాలో వంగల మురళీ మోహన్, కవిత ఆలేటి, వూటుకూరి రవీందర్ రెడ్డి, సిరిపురం ఈశ్వర్‌లకు చోటు దక్కింది.

News April 16, 2026

డైలీ ఎక్స్‌ప్రెస్‌గా కాకినాడ-లింగంపల్లి రైలు

image

కాకినాడ-లింగంపల్లి మధ్య నడిచే కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ రమేశ్ గురువారం తెలిపారు. కాకినాడ-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌కు సామర్లకోటలో హాల్ట్ కల్పించినట్లు చెప్పారు. ప్రజలు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.