News August 11, 2025

భద్రాద్రి: BRS మహిళా నేత మృతి.. KCR సంతాపం

image

అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన BRS పార్టీ వ్యవస్థాపక కార్యకర్త, ఉమ్మడి జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు నాగమణి మరణం పట్ల పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ ప్రారంభం నుంచి నాగమణి చేసిన సేవలను, తెలంగాణ ఉద్యమానికి ఆమె అందించిన కృషిని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

Similar News

News March 16, 2026

కర్ణాటక తరలిపోతున్న పెద్దేముల్ సంపద!

image

పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్, రాంసింగ్ తండా తదితర ప్రాంతాల్లో ఎర్రరాయి అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు సహజమైన సంపదను దోచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రరాయిని వెలికితీసి కర్ణాటకకు తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.

News March 16, 2026

FLASH: తగ్గిన బంగారం ధర

image

బంగారం ధర క్రమంగా దిగొస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.490 తగ్గి రూ.1,59,170కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పతనమై రూ.1,45,900 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 16, 2026

గంట మోగించేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు

image

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే గంట కొట్టాలి. తిరిగి వచ్చేటప్పుడు కొట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను ఎడమ చేతితో పట్టుకుని లయబద్ధంగా మోగించాలి. అనవసరంగా, పదేపదే కొట్టకూడదు. 2,3 సార్లు స్పష్టంగా మోగించడం శ్రేయస్కరం. రాత్రి సమయాల్లో గంటను బిగ్గరగా మోగించకూడదు. ఈ నియమాలను పాటిస్తే దేవతల ఆవాహన జరగడమే కాకుండా, ఆ ప్రతిధ్వని ద్వారా మనసు ఏకాగ్రతను పొంది ఇంట్లో సానుకూల ప్రకంపనలు వ్యాపిస్తాయి.