News September 9, 2025
భవనాలను మంజూరు చేయాలి: ఖానాపూర్ ఎమ్మెల్యే

ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఖానాపూర్‌లో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను మంజూరు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మహ్మద్ అబ్దుల్లా కొత్వాల్‌తో కలిసి ఎమ్మెల్యే మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో తొలి ఫలితాన్ని ప్రకటించిన అధికారులు

ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాన్ని అధికారులు వెల్లడించారు. గ్రామంలోని ఎనిమిది వార్డులకు గాను ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఒక్క వార్డుకు బుధవారం పోలింగ్ నిర్వహించారు. లెక్కింపు పూర్తికావడంతో విజేతను ప్రకటించి, జిల్లాలోనే తొలి ఫలితంగా నిలిపారు. సర్పంచ్ స్థానం ఇదివరకే ఏకగ్రీవం కాగా, ఇప్పుడు వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావడంతో ఉపసర్పంచ్ పదవిని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
News December 17, 2025
అప్పయ్యపల్లి సర్పంచ్‌గా సుప్రియ

HNK జిల్లా శాయంపేట మండలం అప్పయ్యపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుప్రియ వినయ్ కుమార్ ఘన విజయం సాధించారు. అప్పయ్యపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్పంచ్‌గా సుప్రియ ఎన్నికవడంతో వారి మద్దతుదారులు సంబరాలు జరుపుకొన్నారు.
News December 17, 2025
మేకప్ రోజంతా ఉండాలంటే ఇలా చేయండి

మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే ముందుగా చర్మాన్ని శుభ్రం చేసి, టోనర్ అప్లై చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఆపై ప్రైమర్ ఉపయోగించాలి. జిడ్డు చర్మం వారు మ్యాటిఫైయింగ్ ఫార్ములాను, చర్మం పొడిగా అనిపిస్తే హైడ్రేటింగ్ ప్రైమర్‌ను వాడాలి. తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకొని మేకప్ సెట్ చేసుకోవాలి. ఇలా చేస్తే రోజంతా మెరిసిపోయే మేకప్ మీ సొంతం అవుతుంది.


