News March 7, 2025

భానుడి భగభగలు.. మండలాల్లో తీవ్ర వడగాల్పులు

image

అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముంది. ఆ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. గురువారం నాతవరంలో 39.9°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.

Similar News

News December 6, 2025

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు(1/2)

image

వైరస్ ఆశించిన కూరగాయల మొక్కల్లో లేత ఆకులు చిన్నగా, పసుపు రంగుకు మారి పాలిపోయినట్లు కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై అక్కడక్కడ పసుపురంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులపై పసుపు చారలు ఏర్పడి, గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్యభాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకుల ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారతాయి. మొక్క చివరి ఆకులు ఎండి, చనిపోయినట్లుగా ఉంటాయి.

News December 6, 2025

చెన్నూర్: గెలిపిస్తే.. ఉచిత అంబులెన్స్, పెళ్లికి రూ.5000

image

చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సర్పంచ్ అభ్యర్థి దుర్గం అర్చన సంతోశ్ వినూత్న మేనిఫెస్టోతో ప్రచారం చేస్తున్నారు. ఉచిత అంబులెన్స్, ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ.5,000 ఆర్థిక సాయం, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో సహా 15 రకాల హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. హామీలను నమ్ముతూ ప్రజలకు బాండ్లు రాసి ఇస్తున్నారు.

News December 6, 2025

HYDలో పెరిగిన పాదచారుల ‘రోడ్‌కిల్’

image

HYDలో ఫుట్‌పాత్‌ల లేమి, ఆక్రమణల కారణంగా పాదచారుల మరణాలు పెరుగుతున్నాయి. 2024లో సుమారు 400 మంది మరణించగా, 1,032 ప్రమాదాలు జరిగాయి. 2025లో ఇప్పటి వరకు 510 మరణాలకు ఇదే కారణం. ఐటీ కారిడార్లలో సైతం కిలోమీటరుకు సగటున 7 అడ్డంకులు ఉండటంతో ఉద్యోగులు నడవలేకపోతున్నారు. 7,500 స్టాల్స్ తొలగించినా, సమస్య పరిష్కారం కాలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.