News February 10, 2025

భామిని: ఇసుక ర్యాంప్ గుంతలలో మునిగిపోయి వ్యక్తి మృతి

image

భామిని మండలంలోని బిల్లుమడ పంచాయతీ పరిధి పాత బిల్లుమడ గ్రామానికి చెందిన కోటిలింగాల చక్రో (70) వంశధార నదీ తీరంలో స్నానానికి వెళ్లి మృతి చెందాడు. నదిలో ఇసుక ర్యాంప్ గుంతలో నీటిలో మునిగిపోయి మరణించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానిక గ్రామస్థులు హుటాహుటిన నదీ తీరానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 9, 2026

నెల్లూరులో ఎవరి దారి వారిదే..!

image

TDP లో సమిష్టి న్యాయకత్వం మసక బారుతోంది. ఇటీవల ఓ సీనియర్ నేత విషయంలో ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి MLA సోమిరెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం చేస్తున్నా తోటి TDP నేతలకు అది పట్టడం లేదు. సోమిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు, కాకాణిపై ఎదురుదాడికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.

News February 9, 2026

పాలమూరు: రైతులు ALERT.. ఫోన్ చేయండి.!

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో పలు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు “Way2News” ప్రతినిధితో తెలిపారు. మధిర మినుము-1(MBG-1070) రకం ఫౌండేషన్ విత్తనం అందుబాటులో ఉన్నాయని, విత్తన ధర Rs.180/- కిలో. పూర్తి వివరాలకు 94944 31405, 99126 04549 చరవాణి నంబర్లకు సంప్రదించాలన్నారు.
SHARE IT

News February 9, 2026

NZB: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే నాన్ బెయిలబుల్ కేసులు

image

నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 5 మందికిపైగా గుమిగూడితే 163 BNSS చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. సాయంత్రం 5 గంటల తర్వాత బయట ప్రాంతాల వారు ఉండరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే నాన్ బెయిలబుల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.