News November 19, 2025

భారత్‌ను ప్రేమించే వాళ్లందరూ హిందువులే: మోహన్ భాగవత్

image

భారత్‌ను ప్రేమించే వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ దేశంగా ఇండియా ఉండటానికి అధికారిక డిక్లరేషన్ అవసరం లేదని, మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు దాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అస్సాంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ‘హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదు. వేల ఏళ్ల నాగరికత గుర్తింపు. భారత్, హిందూ రెండూ పర్యాయపదాలు’ అని తెలిపారు.

Similar News

News January 18, 2026

2026 దావోస్ సమ్మిట్ థీమ్ ఇదే!

image

‘ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ థీమ్‌తో 2026 దావోస్ సమ్మిట్ జరగనుంది. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన సహకారం, ఆవిష్కరణలు, స్థిరమైన వృద్ధిపై ప్రధానంగా చర్చిస్తారు. ప్రతి ఏడాది JANలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలను 1971లో జర్మన్ ఎకనామిక్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ స్టార్ట్ చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలు, పరిష్కారాలపై చర్చకు వేదికగా సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు.

News January 18, 2026

నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.

News January 18, 2026

ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

<>ఐఐటీ<<>> ఢిల్లీలో 29 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా అర్హత గలవారు అర్హులు. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఐఐటీ హాస్పిటల్, ఎస్టేట్& వర్క్స్, హాస్టల్ విభాగంలో ఈ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.12వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://home.iitd.ac.in/