News May 7, 2025
భారత్ సమ్మిట్‌లో పెద్దపల్లి ఎంపీ

హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అతిథిగా హాజరయ్యారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. తెలంగాణలో ఇలాంటి గ్లోబల్ కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని కాంక్షించారు. రాష్ట్ర యువతకు ఇదొక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
Similar News
News February 16, 2026
నెల్లూరు: పరీక్షలా? క్రికెట్ మ్యాచ్‌లా?

10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలుపై ఫోకస్ చేయాలా? మ్యాచ్‌లు చూడాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఈ నెల 17 నుంచి CBSE పరీక్షలు ప్రారంభం కానుండగా, 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. T20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మ్యాచ్‌లు చూస్తూ టీవీలకు అతుక్కుపోతున్నారు. విద్యార్థుల జీవితాల్లో ముఖ్యమైన పరీక్షలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
News February 16, 2026
MBNR: ఎవరూ అరెస్టు కాలేదు: ఎమ్మెల్యే

ఎవరూ అరెస్టు కాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ తనతోనే బస్సులో ఉన్నారని, ఎటువంటి అరెస్టు జరగలేదని ఆయన స్పష్టతనిచ్చారు.
News February 16, 2026
మెదక్: పోలీసు బందోబస్తును పరిశీలించిన ఎస్పీ

మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


