News August 19, 2025

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: జేసీ

image

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని జేసీ ధాత్రిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. తాత్కాలిక షెడ్లు, తాగునీరు, టాయిలెట్లు కల్పించాలని తెలిపారు.

Similar News

News January 12, 2026

రబీ సీజన్‌కు సరిపడా యూరియా ఉంది: వ్యవసాయాధికారి

image

రబీ 2025–26 సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమారి తెలిపారు. జిల్లాకు అవసరమైన 38,353 మెట్రిక్ టన్నుల యూరియాకు ప్రణాళిక రూపొందించగా, ఇప్పటివరకు 25,504 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేసామని. అక్టోబర్ 1, 2025 నుంచి జనవరి 11, 2026 వరకు 21,734 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 12, 2026

భూపాలపల్లి: కార్యదర్శిని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

image

భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరేడుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి నరేశ్‌ని బెదిరించిన కేసులో బత్తిని సంతోష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి సీఐ డి.నరేశ్ కుమార్ తెలిపారు. గ్రామపంచాయతీ ఆఫీస్ దగ్గర ప్రభుత్వ భూమిలో అక్రమంగా రేకుల షెడ్డు వేయగా మూడుసార్లు నోటీసు ఇచ్చి అడిగితే కార్యదర్శి నరేశ్‌ని దుర్భాషలాడుతూ నరుకుతానని బెదిరించడంతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News January 12, 2026

కామారెడ్డి: సీఎం కప్‌ క్రీడలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న ‘సీఎం కప్‌-2025’ పోటీలకు ఆసక్తి గల క్రీడాకారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌ కోరారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో క్లస్టర్, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.