News August 14, 2025

భారీ వర్షాలపై ముందస్తు చర్యలు: కామారెడ్డి కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాలు కురిసినా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. జిల్లాలో 43 లో లెవల్ కాజ్‌వేలు ఉన్నాయని, వాటిపై ప్రస్తుతం వరద నీరు ప్రవహించడం లేదని పేర్కొన్నారు. ముందస్తుగా పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, గ్రామ పంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తాయని పేర్కొన్నారు.

Similar News

News March 16, 2026

హనుమకొండ: ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

image

సందర్భంగా భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలను తపాలా శాఖ ద్వారా భక్తుల ఇంటికే అందజేయనున్నట్లు హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ హనుమంతు తెలిపారు. రూ.450 చెల్లిస్తే తలంబ్రాలు, ముత్యం, కుంకుమ, ప్రసాదం.. రూ.150 చెల్లిస్తే తలంబ్రాలు, ముత్యం, 80 గ్రాముల ప్రసాదం అందజేస్తామన్నారు. ఆసక్తి గల భక్తులు సమీప తపాలా కార్యాలయాల్లో సంప్రదించి బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 16, 2026

టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. సోమవారం నగరంలోని సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో టెన్త్ పరీక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఈవో బాలాజీ రావు పరిశీలించారు. పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని డీఈఓకు సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.

News March 16, 2026

నర్మెట్ట: పీహెచ్‌సీ, కేజీబీవీను తనిఖీ చేసిన కలెక్టర్

image

నర్మెట్ట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో మందుల నిల్వలు, ఎక్స్‌పైరీ తేదీలను పరిశీలించిన కలెక్టర్, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి వంట గదిని, సరకుల నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.