News August 13, 2025
భారీ వర్షాలు.. కాకినాడ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అధికారులతో బుధవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. 14,15,16 తేదీల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూములు కలెక్టరేట్లో ఏర్పాటు చేశామన్నారు. 0884 2356801 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 12, 2026
GWMC మేయర్‌కో న్యాయం.. సామాన్య పౌరునికో న్యాయమా?

GWMC పన్ను వసూళ్లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కాశిబుగ్గలో రూ.13 వేల బకాయి ఉన్న వృద్ధురాలి ఇంట్లో గ్యాస్ సిలిండర్లను సిబ్బంది సీజ్ చేయడం వివాదాస్పదమైంది. అదే సమయంలో మేయర్ సుధారాణికి చెందిన ఆస్తులు, వ్యాపార సంస్థలు రూ.లక్షల పన్ను బకాయిలున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయమా? అని నిలదీస్తున్నారు.
News March 12, 2026
వనపర్తి డిపోకు రూ.10 కోట్ల ఆదాయం: ఎమ్మెల్యే

కేవలం రెండేళ్లలో వనపర్తి ఆర్టీసీ డిపోకు దాదాపు రూ.10 కోట్ల పైనే ఆదాయం సమకూరిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గత BRS హయంలో దివాలా తీసిన ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో కొనసాగుతుందన్నారు. వనపర్తి డిపోకు సంబంధించి రోజుకు రూ.4 లక్షలు ఉండే ఆర్టీసీ ఆదాయం నేడు రూ.30 నుంచి రూ.35 లక్షలకు పెరిగిందన్నారు. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన RTC డిపో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిందన్నారు.
News March 12, 2026
అనంత: పరీక్షలకు 286 మంది డుమ్మా!

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష జరిగింది. ఈ రోజు పరీక్షలకు సెట్-I ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 5,223 గాను 4,937 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 286 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.


