News August 13, 2025

భారీ వ‌ర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: పొంగులేటి

image

రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వ‌ర్షాలతో జ‌న‌జీవ‌నానికి ఆటంకాలు లేకుండా తక్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మరో నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు కురుస్తాయన్న వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. సీఎం సూచ‌న‌ల‌ మేరకు ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

Similar News

News March 5, 2026

రేపటి నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్: ఖమ్మం కలెక్టర్

image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో జరిగిన సమీక్షలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను 10 రోజుల్లో క్లియర్ చేయాలని సూచించారు. మార్చి 12న సర్పంచ్‌లు, కౌన్సిలర్‌లకు జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.

News March 5, 2026

ఖమ్మం: 414 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 16,663 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 14,801 మందికి గాను 14,526 మంది, అటు ఒకేషనల్ కోర్సుల్లో 2,276 మందికి గాను 2,137 మంది హాజరయ్యారని, మొత్తంగా 414 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అటు ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.

News March 5, 2026

‘పది’ పరీక్షలకు ఒత్తిడికి లోనవద్దు: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. తరగతి గదులు, వంటగది, ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు.