News August 12, 2025

భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వర్ష సూచన నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని కలెక్టర్ సత్య శారద కోరారు. మంగళవారం CM వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆమె జిల్లా పరిస్థితులు, అధికారులు చేపడుతున్న చర్యలను వివరించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులెవరూ సెలవు తీసుకోవద్దని ఆదేశించారు.

Similar News

News March 16, 2026

WGL: సింహపురి ఎక్స్‌ప్రెస్‌ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

వరంగల్‌-కాజీపేట స్టేషన్ల మధ్య హంటర్ రోడ్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున సింహపురి ఎక్స్‌ప్రెస్‌ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఈనెల 15నాటి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్-సికింద్రాబాద్ బస్సు టికెట్, సప్తగిరి థియేటర్ సినిమా టికెట్ లభించాయి. ఇతర గుర్తింపు ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.

News March 15, 2026

జనగణన నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

జనగణన-2027 మార్గదర్శకాల ప్రకారం ఇండ్ల జాబితా, గణన ప్రక్రియను జిల్లాలో నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. మూడు రోజుల పాటు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ ఆదివారం కలెక్టరేట్‌లో ముగిసింది. హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బరాజు, గణాంకాధికారి సతీష్ పాల్గొని శిక్షణ ఇచ్చారు.

News March 15, 2026

ప్రజా పంపిణీ బియ్యం దుర్వినియోగం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న బియ్యం దుర్వినియోగం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్యశారద ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలని సూచించారు. డీఆర్ఓ రామ్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి పాల్గొన్నారు.