News November 19, 2025
భార్య మృతి కేసులో టీచర్ సస్పెన్షన్: అనకాపల్లి డీఈవో

భార్య మృతి కేసులో బుచ్చయ్యపేట మండలం కేపీ అగ్రహారం ఎంపీయూపీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరావును డీఈవో అప్పారావునాయుడు మంగళవారం సస్పెండ్ చేశారు. ఉమామహేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యుల వేధింపులు కారణంగా భార్య వీణ చోడవరంలో నివాసం ఉంటున్న ఇంటిలో ఈనెల 12న కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటనపై పోలీసులు ఉమామహేశ్వరరావును అరెస్టు చేశారు.
Similar News
News January 13, 2026
మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు: సీతక్క

TG: గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరకు దాదాపు రూ.250 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు భారీగా తరలివెళ్తున్నారు.
News January 13, 2026
నగరిలో డైయింగ్ ఫ్యాక్టరీల దందా…!

నగరిలో 18 డైయింగ్ యూనిట్లు ఉన్నాయి. అనేక కారణాలతో 4యూనిట్లు మూతపడ్డాయి. నూలుకు రంగులు వేసి, ఆ నీటిని మళ్లీ రీసైకిల్ చేసి వాడాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్‌తో రంగులు అద్దిన నీటిని కుశస్థలి నదిలోకి వదిలేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ వాటర్ కలుషితం అవుతోంది. కొన్ని యూనిట్లలో పగలు రీసైకిల్ చేస్తుండగా రాత్రి వేళ నేరుగా వదిలేస్తున్నారు. దీనిపై నగరి ఎమ్మెల్యే ఫోకస్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News January 13, 2026
నెల్లూరు: రూ.200 కోట్ల రుణ ‘సహకారం’

సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా 2025-26 మార్చి కల్లా రూ.2,250 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం కాగా, రూ.2,050 కోట్ల రుణాలను 37,039 మంది రైతులకు ఇచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద వరికి రూ.52 వేలు, మిర్చి రూ.1.50 లక్షలు, పసుపు రూ.1.15-1.25 లక్షలు, నిమ్మ రూ.75- 85 వేలు, అరటి రూ.1.10 లక్షలు, చేపలు, రొయ్యలు రూ.3.75 – 4.07 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. మరో 2 నెలలు గడువుకి రూ.200 కోట్ల రుణాలకు అవకాశం ఉంది.


