News October 6, 2025

భీమవరంలో నేడు యథావిధిగా పీజిఆర్ఎస్

image

భీమవరం కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. 1100 నంబర్‌కు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

ప.గో: హీరో నవీన్ పోలిశెట్టి సందడి

image

ఉమ్మడి ప.గో. జిల్లా ఏలూరులో ఆదివారం ‘అనగనగా ఒక రాజు’ మూవీ టీమ్ సందడి చేసింది. చిత్రం విజయోత్సవ సంబరాల్లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షీ చౌదరి ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా పడమర వీధి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సినిమా ప్రదర్శన అవుతున్న థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కాసేపు సరదాగా గడిపారు.

News January 19, 2026

ప.గో: ALERT.. కోర్టులో JOBS

image

ఉమ్మడి ప.గో జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జడ్జి జస్టిస్ శ్రీదేవి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 27 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ఏలూరు కోర్టుకు సమర్పించాలన్నారు. దరఖాస్తు నమూనా, నిబంధనల వివరాలను జిల్లా కోర్టు, కలెక్టరేట్, గ్రంథాలయం, ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు.

News January 19, 2026

భీమవరం వన్‌టౌన్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనుంది. ఈ మార్పును గమనించి, అర్జీదారులు నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి తమ విన్నపాలను అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.