News December 1, 2025
భీమవరంలో నేడు యధావిధిగా PGRS.!

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 11, 2026
నరసాపురం: తీరంలో అలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత

నరసాపురం, మొగల్తూరు సముద్ర తీర ప్రాంతాల్లో అరుదైన అలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఏటా డిసెంబర్ నుంచి మార్చి నెలల మధ్య సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి తీరానికి వచ్చే ఈ తాబేళ్లు.. ఈ ఏడాది వరుసగా ప్రాణాలు కోల్పోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాబేళ్లు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకురావడంతో తీరం వెంబడి దుర్వాసన వెదజల్లుతోంది.
News February 10, 2026
ప.గో: ఫైళ్ల నిర్వహణ ఇక ఈ-ఆఫీస్ ద్వారానే

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత కోసం ఇకపై ప్రతి ఫైలు ఈ-ఆఫీస్ ద్వారానే పంపాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులకు నిర్వహించిన గూగుల్ మీట్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ విధిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని, ఉద్యోగులందరూ ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
News February 10, 2026
ప.గో: ట్రంప్ టారిఫ్ తగ్గించినా.. ‘సిండికేట్’ వదలడం లేదు (2/3)

ఉమ్మడి ప.గో. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇటీవల ట్రంప్ ఎగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో మేలు జరుగుతుందని రైతులు భావించారు. అయితే సిండికేట్ వ్యాపారుల వల్ల రైతులకు ఫలితం దక్కడం లేదు. మేతలు, విత్తనాల ధరలు పెంచి ట్రేడర్లు లాభాలను కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, సిండికేట్ల దోపిడీ నుంచి విముక్తి కలిగించాలని రైతులు కోరుతున్నారు.


