News June 16, 2024
భీమవరం: కేరళ వాసికి 152 వంటకాలతో విందు

భీమవరం పట్టణంలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సభ్యుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి కేరళకు చెందిన రికేశ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పట్టణానికి చెందిన పేరుచర్ల కృష్ణంరాజు 152 రకాల స్వీట్లు, పచ్చళ్ళు, బిరియానీలు, ఫ్రూట్స్‌తో విందు ఏర్పాటుచేశారు. దీంతో శర్మ వంటకాలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
Similar News
News January 24, 2026
ప.గో: ‘అమ్మ.. నాన్న.. చిన్ని క్షమించు’

పాలకోడేరు మండలం పెన్నడ రైల్వే క్వార్టర్స్‌లో గుర్తుతెలియని వ్యక్తి(38) మృతదేహం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతదేహం వద్ద ‘అమ్మ.. నాన్న.. చిన్ని క్షమించు’ అని రాసి ఉన్న లేఖ దొరికింది. వారం రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో సుబ్రహ్మణ్యం సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 24, 2026
ఈనెల 29న పెనుమంట్రలో ప్రత్యేక పీజీఆర్ఎస్: కలెక్టర్

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నెల 29న పెనుమంట్ర ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ సదస్సును మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.