News June 13, 2024
భీమవరం: ఫ్లాట్ ఫామ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయాడు

టౌన్ రైల్వే స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం నర్సాపూర్ నుంచి గుంటూరు వెళ్లే పాసింజర్ ఎక్కే క్రమంలో ఒక వ్యక్తి జారి మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది ఫ్లాట్ ఫామ్‌ను బద్దలు కొట్టి అతడిని రక్షించారు. ఆ వ్యక్తికి ఏమి కాకపోవడంతో రైల్వే సిబ్బంది ప్రయాణకులు అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News March 23, 2025
ప.గో: పది నెలల పాటు జైలులోనే బాల్యం..!

పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన పసల కృష్ణమూర్తి – అంజలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణ భారతి ఆదివారం మృతి చెందారు. భీమవరం సబ్ కలెక్టరేట్ వద్ద జెండా ఎగురవేసిన సందర్భంలో కృష్ణ భారతి తల్లిదండ్రులు జైలు శిక్ష అనుభవించారని గ్రామస్థులు తెలిపారు. నాడు అంజలక్ష్మి ఆరు నెలల గర్భవతి. జైలులోనే కృష్ణ భారతికి అంజలక్ష్మి జన్మనిచ్చారు. కృష్ణ భారతి బాల్యం మొదటి పది నెలలు జైలులోనే గడిపారని తెలిపారు.
News March 23, 2025
గుంటుపల్లి: యువతి హత్య కేసులో నిందితులు వీరే

గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద 2019లో ప్రేమ జంటపై జరిగిన దాడి చేసి యువతి హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు శుక్రవారం జీవిత ఖైదు విధించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జి.కొండూరుకు చెందిన రాజు, జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య, గంగయ్య, అరిసెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. ఈ కేసును పోక్సో కేసుగా పరిగణించి నలుగురికి జీవిత ఖైదు విధించారు.
News March 23, 2025
ప.గో: ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..కలెక్టర్

స్వచ్ఛఆంధ్ర లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగంగా తీసుకోవలసిన చర్యలపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మార్కెటింగ్ శాఖ ఏడితో సమీక్షించారు. జిల్లాలో ఎక్కడ రోడ్లపై చెత్త వేయకూడదని, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకూడదన్నారు.