News October 7, 2025
భీమారం: ఇంట్లోకి చొరబడి మహిళపై కుక్క దాడి

భీమారం మండలంలోని మన్నెగూడెంలో కుక్క దాడిలో వాసం గంగు అనే మహిళ సోమవారం తీవ్రంగా గాయపడింది. ఇంట్లో పడుకుని ఉన్న ఆమెపైకి కుక్క చొరబడి విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. గంగును వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Similar News
News January 19, 2026
NLG: బంకుల్లో వసూళ్లే.. వసతుల్లేవ్!

నల్గొండ జిల్లాలో కొన్ని పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు కరువయ్యాయి. డబ్బులు వసూలు చేస్తున్న యజమానులు కనీస సౌకర్యాలను విస్మరిస్తున్నారు. ఉచిత గాలి, తాగునీరు, మరుగుదొడ్లు ఉండాలన్న రూల్స్ తుంగలో తొక్కుతున్నారు. టాయిలెట్లు కంపు కొడుతున్నాయి.. లేదంటే తాళాలు వేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు కాలం చెల్లినవే. నాణ్యతను ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి.
News January 19, 2026
మేడారం జాతరలో రూ.90.87 కోట్ల పనులు!

మేడారం జాతరలో అభివృద్ధి పనులకు రూ.251 కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది. రూ.101 కోట్లు గ్రానైట్ గద్దెల కోసం, మిగిలిన రూ.150 కోట్లతో రహదారులు, తాగునీటి సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించారు. ప్రస్తుతం జాతరలో PR శాఖ రూ.13.10 కోట్లు, R&B రూ.48.64 కోట్లు, ఇరిగేషన్ రూ.5.90 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ రూ.8.08 కోట్లు, RWS రూ.15.15 కోట్లు మొత్తం రూ.90.87 కోట్ల పనులు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.
News January 19, 2026
ఖమ్మం జిల్లాలో 27 గ్రామాల్లో ‘సౌర’ వెలుగులు!

ఖమ్మం జిల్లాలో విద్యుత్ స్వయం సమృద్ధి లక్ష్యంగా 27 గ్రామాలను ‘మోడల్ సోలార్ విలేజ్’లుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోనకల్, నేలకొండపల్లి, ఎన్కూరు, రఘునాథపాలెం, వైరా మండలాల్లో 16,837 ఇళ్లకు, 4,371పంపుసెట్లకు రెడ్-కో ద్వారా ఉచిత సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు రావినూతలలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


