News April 26, 2024
భువనగిరి: ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు

భువనగిరి జిల్లా నారాయణపూర్(M) శేరిగూడెంకి చెందిన మహేశ్ కుమార్ ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రభంజనం సృష్టించాడు. మొదట కానిస్టేబుల్ ఉద్యోగం చేసిన అతనికి, SSC జూనియర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. అటువైపు జాబ్ చేస్తూ చదువుతూ ముందుకు వెళ్లాడు. తాజాగా వచ్చిన ఫలితాల్లో AEE, AE, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4 ఉద్యోగం సాధించాడు. పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాల్లో ఏకంగా రాష్ట్రంలోనే ఐదవ ర్యాంకు సాధించాడు.
Similar News
News April 18, 2026
నల్గొండ: సర్పంచ్ కుమారుడి ‘పెత్తనం’పై కంప్లైంట్

సర్పంచ్ కుమారుడి వేధింపులు తాళలేకపోతున్నానంటూ చందంపేట మండలం గుంటిపల్లి పంచాయతీ కార్మికుడు నల్ల దేవరాజు శుక్రవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కొడుకు అనధికారికంగా పెత్తనం చలాయిస్తూ, తాను విధులకు హాజరవుతున్నా గైర్హాజరు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గత ఆరు నెలలుగా జీతం రాకుండా అడ్డుపడుతున్నారని, వెంటనే విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కార్మికుడు వేడుకున్నారు.
News April 18, 2026
NLG: పాలిసెట్ విద్యార్థులకు గుడ్ న్యూస్

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) రాసే విద్యార్థులకు నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కేవీ.నరసింహారావు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు తరగతులు జరుగుతాయన్నారు. మే 13న జరగనున్న పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు ఈనెల 18, 19వ తేదీల్లో కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
News April 18, 2026
అడవిదేవులపల్లిలో అత్యధికంగా ఉష్ణోగ్రత

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, అడవిదేవులపల్లిలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదైంది. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. మే నెల చివరి వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.


