News March 9, 2025

భువనగిరి: పగలు అలా.. రాత్రి ఇలా..

image

భువనగిరి జిల్లాలో రాత్రి చలి వణికిస్తుంటే ఉదయం 9 అయిందంటే చాలు ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో భారీ తేడా కనిపిస్తోంది. పోచంపల్లిలో పగటి ఉష్ణోగ్రత 39.1 డిగ్రీలు నమోదైతే, రాత్రి 15.6 డిగ్రీలు నమోదైంది. బొమ్మలరామారంలో పగలు 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైదే, రాత్రి 13 డిగ్రీలకు పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Similar News

News February 15, 2026

ఆదిలాబాద్: ప్రసిద్ధ శైవాలయాలు.. మీరు వెళ్తున్నారా..?

image

1. సిరిచెల్మ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం (ఇచ్చోడ)
2. కదిలి పాపహరేశ్వర ఆయలం (నిర్మల్)
3. వేలాల మల్లన్న స్వామి (చెన్నూర్)
4. జైనథ్ ఆలయం (ADB)
5. గోడిసెర్యాల శ్రీ శివ ఆలయం (ADB)
6. గట్టు మల్లన్న స్వామి ఆలయం (వేలాల)
7. శ్రీ బుగ్గ రాజరాజేశ్వర ఆలయం (బెల్లంపల్లి)
8. ఈస్గాం శివాలయం

News February 15, 2026

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి హెచ్చరిక

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ ఆళ్లగడ్డ తాలూకా నాయకుడు సజ్జల నాగేంద్ర ఖండించారు. శిరివెళ్లలో ఆయన మాట్లాడుతూ.. చేతనైతే కరవు సీమలో కన్నీళ్లు తుడిచే పనులు చేయాలని బైరెడ్డికి సూచించారు. విలువలతో కూడిన రాజకీయం మీలాంటి ఫ్యాక్షన్ రాజకీయ నాయకులకు అర్థం కాదన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

News February 15, 2026

ఖమ్మంకు చేరిన 1,538 మెట్రిక్ టన్నుల యూరియా

image

చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శనివారం సీఐఎల్ కంపెనీకి చెందిన 2,638.62 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,538, భద్రాద్రి జిల్లాకు 300, మహబూబాబాద్ జిల్లాకు 600 మెట్రిక్ టన్నులను కేటాయించినట్లు ఏవో పవన కుమార్ తెలిపారు. మిగిలిన 200 టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశారు. సాగు సీజన్ నేపథ్యంలో ఈ యూరియా రాకతో రైతులకు ఎరువుల కొరత తీరనుంది.