News August 23, 2025

భువనగిరి: పత్తి చేనులో పని చేస్తుండగా పాము కాటు

image

రాజపేట మండలం బేగంపేటలో విషాదం చోటు చేసుకుంది. పత్తి చేనులో పని చేస్తున్న ఓ రైతు పాము కాటుతో మరణించాడు. గ్రామానికి చెందిన జామ చెట్టు భాస్కర్ గౌడ్ శుక్రవారం తన పత్తి చేనులో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News January 22, 2026

28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే?

image

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈ నెల 31న మెగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్(GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) ఖాళీలను భర్తీ చేయనుంది. AP, TGలో దాదాపు 2వేల జాబ్స్ ఉండే అవకాశం ఉంది. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తుంది. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100.
వెబ్‌సైట్: <>indiapostgdsonline.gov.in<<>>

News January 22, 2026

విటమిన్ B12 లోపాన్ని నిర్లక్ష్యం చేయకండి

image

రోజంతా అలసట, మూడ్ స్వింగ్స్, మర్చిపోవడం వంటివి సాధారణ సమస్యలే అనుకుంటున్నారా? కానీ ఇవి విటమిన్ B12 లోపానికి హెచ్చరికలు కావచ్చు. భారత్‌లో 15 శాతం కంటే ఎక్కువ మందికి ఈ లోపం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. B12 తక్కువైతే అలసట, నరాల బలహీనత, నడవడంలో ఇబ్బంది, నోటిలో పుండ్లు, దృష్టి సమస్యలు, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మాంసాహారం, చేపలు, గుడ్లు, పాలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు.

News January 22, 2026

త్వరలో జలమండలి విస్తరణ షురూ!

image

జీహెచ్ఎంసీ పునర్విభజనతో జలమండలి విస్తరణ కూడా షురూ కానుంది. శివారు ప్రాంతాల విలీనంతో జలమండలి తన సేవలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త జోన్లు, సర్కిళ్ల ఏర్పాటుతో సేవలు మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 12 కొత్త జోన్లు, 60 సర్కిల్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, జలమండలి విస్తరణకు ముహూర్తం ఖరారు చేయనున్నారు.