News August 21, 2025
భువనగిరి: పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

భువనగిరి మండలం నందనం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎంత మంది ఉన్నారని, ఈ సంవత్సరం ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయని స్కూల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠాలు చదివించారు. సంఖ్య తక్కువగా ఉందని, మళ్లీ గ్రామంలో ‘బడిబాట’ నిర్వహించి కొత్త విద్యార్థులు చేరేలా చూడాలన్నారు.
Similar News
News January 22, 2026
కోనసీమ: బైపాస్ రోడ్డుపై ప్రమాదం.. వ్యక్తి మృతి

రాజోలు(M) పాలగుమ్మి బైపాస్ రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన <<18919438>>రోడ్డు ప్రమాదం<<>>లో పాలకొల్లుకు చెందిన షేక్ మస్తాన్(45) మృతి చెందినట్లు ఎస్సై రాజేష్ గురువారం తెలిపారు. మస్తాన్ సైకిల్‌పై నగరం వైపు వెళ్తుండగా గుర్తుతెలియని మోటార్ సైకిల్ ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో తొలుత రాజోలు, ఆపై మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News January 22, 2026
‘మ్యాజిక్ వీవ్స్’తో మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారాలి: కలెక్టర్

మహిళల సాధికారత, ఉపాధి సృష్టే ధ్యేయంగా జిల్లాలో ‘మ్యాజిక్ వీవ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆప్కో ఆధ్వర్యంలో అమలయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చనున్నట్లు తెలిపారు. మన సంప్రదాయ చేనేత రంగానికి ఆధునిక డిజైన్లను జోడించి, పర్యావరణానికి మేలు చేసే ఉత్పత్తులను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
News January 22, 2026
500 వికెట్లు.. జలజ్ సక్సేనా రికార్డు

మహారాష్ట్ర ప్లేయర్ జలజ్ సక్సేనా (39 Yrs) దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. పుణెలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నారు. అదే విధంగా 156 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7,202 పరుగులు సైతం చేశారు. జలజ్ కంటే ముందు ఫస్ట్ క్లాస్‌లో 18 మంది 500 వికెట్లు తీశారు.


