News August 11, 2025
భువనగిరి: రేపు గణిత ఉపాధ్యాయులకు శిక్షణ

ప్రాథమిక పాఠశాలల్లో గణితం బోధించే ఉపాధ్యాయులకు రేపు(మంగళవారం) శిక్షణ ఇస్తామని జిల్లా విద్యాధికారి సత్యనారాయణ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని కాంప్లెక్స్ పరిధిలోని ఇద్దరు చొప్పున ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు బీబీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇస్తామని, తప్పక హాజరుకావాలని సూచించారు. అనంతరం జరిగే కాంప్లెక్స్ సమావేశాల్లో అన్ని పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారన్నారు.
Similar News
News March 15, 2026
22న రైతు భరోసా నిధులు

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దిపేట(D) నర్మెట్టలో CM రేవంత్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు 20రోజుల తర్వాత రెండో విడత, APR నెలాఖరులోగా మూడో విడత నిధులు అందజేయనున్నారు. 3 విడతల్లో కలిపి రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ కానున్నాయి.
News March 15, 2026
LSGకి బిగ్ షాక్?

ఈ నెలాఖరున ప్రారంభమయ్యే IPLలో LSG జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంతో ఈ సీజన్ ఆడటం అనుమానమే అని అంటున్నాయి. తొడ కండరాల గాయం వల్ల T20WCలోనూ అతను ఆడలేదు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈసారి వేలంలో ఇతడిని LSG రూ.2కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్లో హసరంగా RR తరఫున ఆడి 11 వికెట్లు తీశారు.
News March 15, 2026
ప్రకాశం: పాలేరు వాగులో మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలోని పాలేరు వాగులో దొరికిన <<19383562>>మృతదేహంపై <<>>పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుడి ఆనవాళ్ల కోసం సోషల్ మీడియాలో ఫొటోలు ఉంచడంతో పాటు పక్క జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపినట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఎవరైనా అదృశ్యమైన వ్యక్తుల వివరాలు ఉంటే తక్షణమే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.


