News February 5, 2025
భువనగిరి: రైలు కింద పడి వ్యక్తి మృతి

వలిగొండ మండలం టేకులసోమారం గ్రామ శివారులోని రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు టేకులసోమారానికి చెందిన నారగోని సైదులుగా గుర్తించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 26, 2025
HYD: అమ్మానాన్న సారీ.. స్టేటస్ పెట్టి SUICIDE

మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో సోమేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు సోమవారం జరిగిన IPLలో ఒక్కరోజే లక్ష పోగొట్టుకున్నాడు. దీంతో అతడు.. ‘నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ’ అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 26, 2025
జిన్‌పింగ్ కుటుంబీకుల వద్ద భారీగా అవినీతి ఆస్తులు!

దేశంలో అవినీతిని వేటాడుతున్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెబుతుంటారు. కానీ వారి కుటుంబమే రూ.కోటానుకోట్లు వెనకేసిందని రేడియో ఫ్రీ ఏషియా నివేదిక తెలిపింది. ‘2012లో అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి జిన్‌పింగ్ అవినీతి నిరోధక ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీలోని వేలాదిమందిని అరెస్ట్ చేశారు. అయితే తమకున్న ప్రభుత్వ, ప్రైవేటు మార్గాల్లో జిన్‌పింగ్ కుటుంబం భారీగా కూడబెట్టింది’ అని వెల్లడించింది.
News March 26, 2025
KMR: బాలుడి అమ్మకం కేసును ఛేదించిన పోలీసులు

కామారెడ్డిలోని వీక్లీ మార్కెట్లో కంస్యపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమకు పుట్టిన మగ బిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల విషయంలో వాగ్వాదం రావడంతో స్థానికులు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి బాలుడిని అప్పగించారు. పెట్రోలింగ్ , బ్లూకార్డ్ సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.